Site icon NTV Telugu

Mega Victory Mass song: ‘ఏందీ బాసు సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి’.. మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ చూశారా!

Mega Victory Mass Song

Mega Victory Mass Song

Mega Victory Mass song: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌గా ‘మెగా విక్టరీ మాస్’ పాట ఈ రోజు అధికారికంగా విడుదలైంది.

READ ALSO: New Year 2026-Vizag: న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ.. ఈసారి డబుల్ టార్గెట్!

ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్‌లు స్టైలిష్ పబ్ సెట్టింగ్‌లో ఎంట్రీ ఇస్తూ, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టారు. ఈ మాస్ కాంబినేషన్ తొలిసారి స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానుల ఎక్సైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. ఈ సినిమాకు భీంస్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, తాజాగా రిలీజ్ అయిన లిరికల్ వీడియోలో ‘ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..’ అంటూ సాగే హుషారైన లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ రాశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోగా చిరంజీవి, హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, హీరో విక్టరీ వెంకటేష్ ఎక్స్‌టెండెడ్ కేమియోలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ సినిమా జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

READ ALSO: Sudarshan Chakra: ఢిల్లీకి పెట్టని కోటలా ‘సుదర్శన చక్ర’.. ఇకపై గస్తీ మామూలుగా ఉండదు!

Exit mobile version