Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi on Kaaka: కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఒక కొత్త హీరోకు ఇండస్ట్రీలోని ఇంతమంది ప్రముఖులు మద్దతుగా నిలవడం చాలా అరుదని అన్నారు. హీరో అనీష్ అదృష్టవంతుడని పేర్కొన్నారు. ఈ సినిమా సాంగ్‌ను నాని, ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారని.. ఇంకా ప్రధానంగా నాగార్జున వెన్నుముకలా నిలిచారని తెలిపారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారని, వెంకటేష్ సహా పలువురు ప్రముఖులు ప్రీమియర్స్ చూసి అనీష్‌ను అభినందించారని గుర్తుచేశారు.
Also Read
- AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత
- Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
సినిమాపై ఉన్న ప్రేమ, భక్తి, అభిమానం వల్లే ఇంతమంది ప్రముఖులు ‘ఇట్లు అర్జున’కు మద్దతుగా నిలిచారని చిరంజీవి అన్నారు. నిర్మాత వెంకీ కుడుముల, దర్శకుడు మహేష్, హీరో అనీష్ సహా చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా కొత్త కథలు, విభిన్నమైన ఆలోచనలతో వస్తున్న యువ దర్శకులు, రచయితలు తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఈ సినిమాలో అనీష్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి చెప్పారు. మాటలు లేకుండా కేవలం హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించడం కొత్త నటుడికి పెద్ద సవాలని అన్నారు. తొలి సినిమాతోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను అద్భుతంగా పోషించిన అనీష్‌కు హ్యాట్సాఫ్ అన్నారు. హీరోయిన్ అనస్వర రాజన్ నటన కూడా చాలా బాగుందని ప్రశంసించారు. దర్శకుడు మహేష్ ప్రేమకథను స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా మేళవించారని కొనియాడారు.
ఆపై సంగీత దర్శకుడు తమన్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్ ‘కాక’ సినిమాకు కూడా పనిచేస్తున్నారని.. ఇంకా ఈ మధ్య తమన్ తాను పనిచేసిన మిగితా సినిమాలతో పాటు ‘కాక’ గురించి తెగ మాట్లాడుతున్నాడని చెబుతూనే, ప్రమోషన్ ఎక్కవ చేయొద్దని అన్నారు. అలాగే నిజానికి తమన్ చెప్పింది అక్షరాలా నిజమని.. ‘కాక’ సినిమాతో డెఫినెట్లీ కొడతాం.. అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ‘ఇట్లు అర్జున’ సినిమాను ప్రేక్షకులంతా థియేటర్లలో చూడాలని, రెండున్నర గంటల పాటు మంచి వినోదం లభిస్తుందని చెప్పారు. మరోవైపు దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా కూడా మంచి విజయాన్ని అందుకున్నారని చిరంజీవి అభినందించారు. తనకు వెంకీ సినిమాలంటే చాలా ఇష్టమని, తనతో ఓ సినిమా చేయాలని అడిగానని వెల్లడించారు. మంచి కథతో వస్తానని వెంకీ చెప్పినట్లు నవ్వుతూ తెలిపారు.
Definitely కొడతాం 😎🔥
That’s the statement from our #KAAKA Megastar @KChiruTweets garu 💥
JAN 13th Sankranthi 2027❤️🔥
#KAAKAOnJan13 https://t.co/iREEOcE75Z
— Kaaka (@KaakaMovie) November 17, 2026
తాజావార్తలు
-
Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
-
CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!