NTV Telugu Site icon

Waltair Veerayya: ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం వైజాగ్ కు బయలు దేరిన చిరంజీవి

Waltair Veerayya Shocks

Waltair Veerayya Shocks

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌లు విశాఖ‌లోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. కానీ విశాఖ పోలీసులు చిరంజీవికి, ఆయ‌న అభిమానుల‌కు షాకిచ్చారు. ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి లేద‌ని విశాఖ సీపీ తేల్చిచెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.

Read Also: Sreeleela: వామ్మో శ్రీలీల ఇంతమంది హీరోలతో సినిమాలు చేస్తోందా..!

ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఈవెంట్ నిర్వహించుకుంటామని అడిగారని, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో వేడుక జరుపుకోవాలని చెప్పామని వివరించారు. చిత్రబృందం సమర్పించిన దరఖాస్తుకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. సాయంత్రం వైజాగులో జరిగే వేడుక చిరంజీవి, రవితేజ హైదరాబాదునుంచి బయలుదేరారు. శంషాబాదు ఎయిర్ పోర్టులో వేదిక మార్పుపై అడిగిన ప్రశ్నకు వారికి ఉన్న వీలును బట్టి పర్మీషన్ ఇస్తారని చిరంజీవి అన్నారు.
Read Also: Elephant Died: వేటగాళ్ల ఉచ్చుకు మరో ఏనుగు బలి

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాలా ఏండ్ల తర్వాత సంక్రాంతికి పండక్కి వస్తుండటంతో బాస్‌ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి లుక్‌.. గ్యాంగ్‌ లీడర్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మాస్‌ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్‌ వచ్చింది.

Show comments