మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘హిట్లర్’ సినిమా ఒక మైలురాయి. 1997లో విడుదలైన ఈ సినిమా ఆయనకు గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించిన బుల్లితెర నటి మీనా కుమారి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ మూవీ కారణంగా ఒక చేదు అనుభవం ఎదురుకుట్లుగా తెలిపింది. ఎంటది అంటే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్‌లో భాగంగా చిరంజీవిని ఆమె ‘రాక్షసుడా.. నిన్ను చూస్తే భయంగా ఉంది’ అనే డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. కేవలం అది సినిమాలోని డైలాగ్ మాత్రమే అయినప్పటికీ, తమ అభిమాన హీరోను అలా అనడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో..
Also Read : Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!
ఈ డైలాగ్ వల్ల కలిగిన కోపంతో ఒకసారి ఆమె ఒంగోలు వెళ్తుండగా సుమారు 50 మంది అభిమానులు ఆమె కారును అడ్డుకుని గొడవకు దిగారు.. చిరంజీవి గారిని అలా ఎలా అంటావని వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. చివరికి అది కేవలం దర్శకుడు చెప్పిన సినిమా సీన్ మాత్రమే అని, నిజ జీవితంలో తనకు చిరంజీవి గారంటే ఎంతో గౌరవమని నచ్చజెప్పడంతో వారు శాంతించారట. దశాబ్దాలు గడిచినా ఆ భయంకరమైన అనుభవం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని మీనా కుమారి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
