Site icon NTV Telugu

Chiranjeevi Gifts Range Rover: హిట్ మిషన్ కు మెగా గిఫ్ట్..!

Chiranjeevi Gifts

Chiranjeevi Gifts

Chiranjeevi Gifts Range Rover: సంక్రాంతి 2026 గాను విడుదలైన ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమా భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానులు ఆదరణ లభించడంతో బాక్సాఫీస్ వద్ద మెగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి తన గ్రేస్ ఏంటో అభిమానులకు చూపించాడు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణలలో ఒకరు దర్శకుడు అనిల్ రావిపూడి అని కచ్చితంగా చెప్పవచ్చు. వరుసగా తొమ్మిది విజయాలతో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న అనిల్ రావిపూడి టాలీవుడ్ టాప్ దర్శకులలో ముందు వరుసలలో నిలబడ్డాడు.

Rava Kesari Recipe: గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ ఇంట్లోనే.. స్పెషల్ రవ్వ కేసరి చేసే సీక్రెట్ టిప్ ఇదిగో..!

ఇదిలా ఉండగా.. మన వర శంకర ప్రసాద్ గారు సినిమా భారీ విజయ సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఇప్పటి వరకు 300+ కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇది ఇలా ఉండగా సినిమా విజయంలో భాగంగా తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

India vs New Zealand 3rd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పుడే రెండు వికెట్లు డౌన్!

Exit mobile version