NTV Telugu Site icon

Shankar Daughter : శంకర్ కూతురు రిసెప్షన్ లో చిరు ఫ్యామిలీ…

Sankar Daughter

Sankar Daughter

కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన తెరకెక్కించిన సినిమాలు విడుదలయ్యాయి.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. కాగా, శంకర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్‌ కార్తీక్‌ తో కూతురు పెళ్లి జరిపించారు శంకర్.. ఆ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ వివాహనికి మణిరత్నం,సుహాసిని దంపతులతో పాటు చియాన్ విక్రమ్‌, కమల్‌ హాసన్, రజినీకాంత్‌, నయన్‌ ,విఘ్నేశ్ శివన్‌, సూర్య, కార్తీ , నరేశ్‌, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు.. తాజాగా చెన్నై లో శంకర్ గ్రాండ్ రీసెప్షన్ ను ఏర్పాటు చేశారు.. కొత్త పెళ్లి కూతురు, పెండ్లి కొడుకు బ్లూ డ్రెస్సులో మెరిశారు..

ఇక ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్‌-ఉపాసన దంపతులతోపాటు విజయ్‌ సేతుపతి, జయం రవి, మోహన్‌లాల్‌, రన్‌వీర్‌సింగ్‌, శివకార్తీకేయన్‌ కపుల్‌, కాజల్‌-గౌతమ్‌ కిచ్లూ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లోకేశ్‌ కనగరాజ్‌, బోనీకపూర్‌, జాన్వీకపూర్‌, నెల్సన్ దిలీప్ కుమార్‌, అనిరుధ్ రవిచందర్‌ లు, బాలీవుడ్ నుంచి పలువురు హీరోలు హాజరైన సందడి చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Show comments