Site icon NTV Telugu

Chiranjeevi – Venkatesh: ‘డాడీ’ సినిమాపై వెంకీ ఆసక్తికరమైన కామెంట్స్.. రివీల్ చేసిన మెగాస్టార్

Chiranjeevi Venkatesh

Chiranjeevi Venkatesh

Chiranjeevi – Venkatesh: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి, హీరో విక్టరీ వెంకటేష్‌కు మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, హీరో విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వెంకటేష్ తన మనసులో ఏమున్నా మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తి అని చిరంజీవి ఈ వీడియోలో కొనియాడారు. చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమా గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ ఈ వీడియోలో చెప్పారు. డాడి సినిమా గురించి విక్టరీ వెంకటేష్, చిరంజీవితో ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం

READ ALSO: Bajaj Pulsar: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బజాజ్ పల్సర్.. కస్టమర్ల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ ప్రకటన

హీరో రానా, విక్టరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన డాడీ సినిమాపై పలు ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పారు. ‘డాడీ’ సినిమా విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అది కేవలం ఒక మోస్తరు ఫలితాన్ని మాత్రమే అందుకుంది. అయితే దీని గురించి వెంకటేష్ తనతో మాట్లాడుతూ.. “ఆ సినిమా మీరు చేయడం వల్లే సోసోగా ఆడింది, అదే నేను చేసి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేది” అని తన ముఖం మీదనే సరదాగా అన్నారని గుర్తు చెప్పారు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా గురించి మరొక స్టార్ హీరో అలా అనడం అరుదు. కానీ వెంకటేష్‌కు తనకు మధ్య ఉన్న స్నేహం, నమ్మకం, విడదీయలేని బంధం వల్లే ఆయన అంత నిష్పక్షపాతంగా తనతో మాట్లాడగలిగారని చిరంజీవి వివరించారు. వెంకటేష్‌లోని “నికార్సైన మనిషి”ని ఈ సంఘటన ద్వారా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి వెండి తెరపై సందడి చేయడానికి రడీ అవుతున్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

READ ALSO: Portronics Pico 14 Projector: థియేటర్లతో పని లేదు.. ఇకపై మీ జేబులోనే 100- ఇంచెస్ టీవీ!

Exit mobile version