Site icon NTV Telugu

Indra Re Release: ఇంద్ర సేనారెడ్డి అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా: చిరంజీవి

Indra Re Release

Indra Re Release

Chiranjeevi Talks About Indra Re Release: ‘మెగాస్టార్’ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఇందులో చిరు డైలాగ్స్‌, నటన, మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. బి.గోపాల్‌ దర్శకత్వం వహించిన ఇంద్ర అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి సహా మొత్తం మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం చూపిన ఇంద్ర.. రీ-రిలీజ్ కాబోతోంది.

చిరంజీవి పుట్టినరోజు, అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ యాభయ్యేళ్ల సంబరాలను పురస్కరించుకొని ఇంద్ర సినిమాని ఆగస్టు 22న రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఇంద్ర రీ-రిలీజ్‌సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వీడియోను వైజయంతీ మూవీస్‌ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: VidaaMuyarchi: అజిత్‌ ‘విదాముయార్చి’ రిలీజ్‌ డేట్‌ లాక్!

ఇంద్ర సినిమా చూసే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా అని, బాగా ఎంజాయ్ చేయండని చిరంజీవి అన్నారు. ‘ఇంద్ర.. ఇంద్ర సేనారెడ్డి.. అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందడానికి కారణం చిత్ర కథ. సినిమా కోసం ప్రతిఒక్కరు చాలా కష్టపడ్డారు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. 22 సంవత్సరాల రీ-రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. చాలా భావోద్వేగానికి గురవుతూన్నా. ఇంద్ర సినిమా చూసే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా. బాగా ఎంజాయ్ చేయండి’ అని చిరు అన్నారు.

Exit mobile version