NTV Telugu Site icon

Chiranjeevi – Venkatesh – Balakrishna: చూడడానికి రెండు కళ్లు సరిపోవట్లేదుగా.. ఒకే ఫ్రేములో ముగ్గురు లెజెండ్స్!

Iifa 2024 Megastar

Iifa 2024 Megastar

Chiranjeevi – Venkatesh – Balakrishna in iifa 2024: శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకి భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు నిర్వాహకులు. ఇకపోతే., టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, నానిలు పాల్గొన్నారు. అలాగే తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు నటీనటులు పాల్గొనగా., బాలీవుడ్ నుంచి కూడా పెద్దెతున్న ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో అందరి దృష్టి టాలీవుడ్ బడా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్లే ప్రధాన ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు.

Nandamuri Balakrishna: ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్న నందమూరి నటసింహం..

40 ఏళ్ల పైబడి వారి నటన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఇప్పుడు కూడా వారి సాన్నిహిత్యం కొనసాగుతుందంటూ వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఐఫా 2024 కార్యక్రమంలో భాగంగా ముగ్గురు బడా హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఇప్పుడు వారి అభిమానులకు పండుగలాంటి వాతావరణం ఏర్పడింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లను ఒకేసారి స్టేజిపైకి పిలవడంతో కార్యక్రమంలో సందడి నెలకొంది. వారిద్దరు ఒకేచోట ఉండడంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వారు ముగ్గురు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని హత్తుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ” అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా” సినిమా అవార్డు దక్కించుకోగా.. బాలకృష్ణకు ” గోల్డెన్ లెగసి ” అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటుడిగా దసరా సినిమాకు గాను హీరో నానికి అవార్డు దక్కింది.

Show comments