Site icon NTV Telugu

Chiranjeevi vs Ravi Teja: చిరంజీవి వర్సెస్ రవితేజ.. గెలుపు ఎవరిదో!

Chiranjeevi Vs Ravi Teja

Chiranjeevi Vs Ravi Teja

Sankranthi 2025 Box Office Fight: 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత.. చిరు చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. అయితే మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్నాడు.

Also Read: Agent OTT: ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్‌’ సినిమా!

ఉగాది సందర్భంగా (ఏప్రిల్ 9) రవితేజ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సమాజవరగమన సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా నేడు ప్రకటించారు. ‘వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపొండ్రి’ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో ప్రస్తుతానికి 2025 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది.

Exit mobile version