Chiranjeevi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న చిరంజీవికి హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం సహా పలు నగరాల్లో సొంత ఆస్తులు ఉన్నాయి. అయితే తాజాగా తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో చిరంజీవి ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Read Also:IRE vs RSA: క్రికెట్‌లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐర్లాండ్!
ఊటీ అవుట్ స్కర్ట్స్‌లో చిరంజీవి 5.5 ఎకరాల ఆస్తిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ ఆస్తి పచ్చని తేయాకు తోటలు, మంచి వ్యూ పాయింట్‌తో చుట్టుముట్టబడిన కొండపై ఉంది. దీని విలువ రూ.16 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు.
Read Also:Jr NTR : ఏపీ – తెలంగాణ దేవర 11 రోజుల కలెక్షన్స్.. మాస్ మూలవిరాట్
త్వరలో ఆ ఐదున్నర ఎకరాల స్థలంలో అనుభవజ్ఞుడైన ఆర్కిటెక్ట్ ఆధ్వర్యంలో ఫామ్‌హౌస్ నిర్మించేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ఊటీ ఆస్తిని రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా చూశారని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర` సినిమాతో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. విశ్వంభర సినిమా షూటింగ్ దశలో ఉంది, వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.