మీ పిల్లలకు చిప్స్ ప్యాకెట్స్ కొనిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. చిప్స్ ప్యాకెట్ పేలి ఓ బాలుడు కంటి చూపును కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బలంగీర్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్ పేలిన ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడి జీవితంలో చీకట్లుకమ్ముకున్నాయి. టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగర్డ్‌ఘాట్ గ్రామంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ఒక కంటి చూపును కోల్పోయాడు.
Also Read:US Iran Tensions: ఇరాన్‌పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ ఎయిర్‌బేస్‌లో విమానాల మోహరింపు..
నివేదికల ప్రకారం, బాధిత బాలుడు లాబ్ హర్పాల్ కుమారుడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాలుడు షాపుకు వెళ్లి చిప్స్ ప్యాకెట్ కొనుకొచ్చుకున్నాడు. అదే సమయంలో, అతని తల్లి భానుమతి హర్పాల్ వంటగదిలో వంట చేస్తోంది. గ్యాస్ స్టవ్ ఆన్‌లో ఉంది. అయితే వాటర్ కోసం తల్లి బయటకు వెళ్లగా.. ఈ సమయంలో చిప్స్ ప్యాకెట్ తీసుకుని ఆ పిల్లవాడు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళాడని తెలిసింది. గ్యాస్ స్టవ్ కింద ఉండడంతో అకస్మాత్తుగా, ఆ ప్యాకెట్ బాలుడి చేతిలో నుండి జారిపడి, మంటలను తాకి, పెద్ద శబ్దంతో పేలిపోయింది. పేలుడుధాటికి బాలుడి కంటికి తీవ్ర గాయం అయ్యింది.
Also Read:Bhartha Mahasayulaku Wignyapthi Review: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ
బిడ్డ ఏడుపులు విని తల్లి వంటగదిలోకి పరిగెత్తింది. అక్కడ తన కొడుకు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసింది. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కంటి గాయం చాలా తీవ్రంగా ఉందని, అది కోలుకోలేనిదని, ఆ బిడ్డ ఆ కన్నుతో ఎప్పటికీ చూడలేడని వైద్యులు నిర్ధారించారు. ఇది విన్న కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన కొడుకుకు బిస్కెట్లు కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చానని, కానీ అతను చిప్స్ తెచ్చుకున్నాడని కన్నీటి పర్యంతమైన తల్లి భానుమతి హర్పాల్ చెప్పింది. పిల్లల కోసం తయారుచేసిన ఆహార ఉత్పత్తులు బాంబులా పేలిపోయేంత ప్రమాదకరంగా ఎలా ఉంటాయని ఆమె ప్రశ్నించింది. ఈ సంఘటనతో ఆగ్రహించిన కుటుంబం, టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్‌లో చిప్ తయారీ సంస్థపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
