Chintamaneni Prabhakar: ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. ఎమ్మెల్యే చింతమనేని హల్చల్, శ్రీనివాస్ సస్పెండ్!
- ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా
- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్
- పార్టీ నుంచి అడ్వకేట్ శ్రీనివాస్ సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాల్చల్ చేశారు. తన కుటుంబ సభ్యులపట్ల టీడీపీ నాయకుడు ఈడుపుగంటి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు చింతమనేని అనుచర వర్గం ప్రయత్నించింది. అయితే చింతమనేని పోలీసులు అడ్డుకోవడంతో అర్ధరాత్రి సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. గతంలో శ్రీనివాస్ చింతమనేని తరపు న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు పెరగడంతో దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ అడ్వకేట్ శ్రీనివాస్ తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన తరపున మాట్లాడే వారిపై ఘాటుగా శ్రీనివాస్ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని చింతమనేని ఫిర్యాదు చేయడంతో పాటు అతని ఇంటికి చింతమనేని అనుచర వర్గం చేరుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. అరెస్టు చేయకుంటే అక్కడ నుంచి కదిలేది లేదని చింతమనేని తేల్చి చెప్పారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి టీడీపీ నేత శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత, అడ్వకేట్ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ నేతలకు సహకరించడంతో పాటు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడంతో అతడిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఈడ్పుగంటి – చింతమనేని వ్యవహారం ఇప్పుడు టీడీపీలో దుమారాన్ని రేపుతుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!