Chinta Mohan: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి కి అభినందనాలు.. అయన పోరాట స్ఫూర్తి గెలుపునిచ్చిందని పేర్కొన్నారు. ఆయన ప్రసంగాల్లోని వాడి వేడి కదలించింది.. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు చింతామోహన్.
Read Also: Sonia Gandhi Birthday: తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ..
ఇక, ఎల్జీ పాలిమర్స్ వైజాగ్ లో గ్యాస్ లీకై అనేకమంది మరణించారు.. ఇప్పటికీ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చింతామోహన్.. శ్రీసిటి దగ్గరలో వారి ప్లాంట్ కు అనుమతి ఇచ్చారు.. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.. తిరుపతి జిల్లాలో ఈవీఎంలను హెడ్ క్వార్టర్స్ లో ఉంచకుండా.. పాపానాయుడు పేటలో పెట్టడం అనేక అనుమాలకు తావిస్తోందన్నారు.. ఓటర్ లిస్ట్‌లు రెవెన్యూ కార్యాలయాలలో కాకుండా మున్సిపల్ కార్యాలయాలలో పెట్టడమేమిటో అర్థం కావడం లేదన్న ఆయన.. రాత్రిపూట కూడా ఓట్లను నమోదు చేస్తున్నారు.. ఇది దేనికి సంకేతంగా భావించాలలో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాపై అటు అధికారపక్షం, ఇటు విపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.. పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు కూడా చేసుకున్న విషయం విదితమే. మరోవైపు.. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారిని ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకుండా చూడాలంటూ ఈసీ దృష్టికి వైసీపీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.