Site icon NTV Telugu

Nidhi Agarwal, Chinmayi : ఫ్యాన్స్ ముసుగులో మృగాలు! నిధి అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్

Nidhi Agarwal Incident, Chinmayi Comments,

Nidhi Agarwal Incident, Chinmayi Comments,

అభిమానం అనేది ఉండవచ్చు కానీ, అది అదుపు తప్పితే అవతలి వారికి నరకం చూపిస్తుంది. తాజాగా ‘రాజాసాబ్’ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుధవారం సాయంత్రం జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కేవలం ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, ఆమెను తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిధి అగర్వాల్ ఎలాగోలా కారులోకి ఎక్కిన తర్వాత ‘ఓ మై గాడ్’ అంటూ షాక్‌లో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే..ఈ దారుణ ఘటనపై సింగర్ చిన్మయి ఎప్పటిలాగే తన గళం విప్పారు.

Also Read : Shambhala : సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్

సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘వీళ్లు మగాళ్లు కాదు, జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మృగాలు. ఇలాంటి వారిని ఈ గ్రహం మీద ఉంచకూడదు.. వేరే గ్రహానికి పంపేయాలి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఇలా హీరోయిన్లను వేధించడం పట్ల ఆమె ఫైర్ అయ్యారు. సెలబ్రిటీల కంటూ ఒక ప్రైవసీ ఉంటుందని, వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. అంతే కాదు..

ఈ ఘటనను చూసి సాధారణ నెటిజన్లు కూడా ‘ఇది అభిమానం కాదు, పక్కా వేధింపులు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వంటి పెద్ద హీరో సినిమా ప్రమోషన్లలో ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యాలు ఉండటం ఏంటని మేకర్స్‌ను కూడా ప్రశ్నిస్తున్నారు. సినిమాల పరంగా ‘రాజా సాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో రాబోతోంది. కానీ, ఇలాంటి సంఘటనలు సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయని, ఫ్యాన్స్ తమ ప్రవర్తన మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Exit mobile version