అభిమానం అనేది ఉండవచ్చు కానీ, అది అదుపు తప్పితే అవతలి వారికి నరకం చూపిస్తుంది. తాజాగా ‘రాజాసాబ్’ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుధవారం సాయంత్రం జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కేవలం ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, ఆమెను తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిధి అగర్వాల్ ఎలాగోలా కారులోకి…