Site icon NTV Telugu

Thailand: చైనా పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ కొత్త వీసా రహిత విధానం

Thailand

Thailand

Thailand: చైనా నుంచి వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కొత్త వీసా రహిత ప్రవేశ కార్యక్రమం కింద సోమవారం బ్యాంకాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది చైనీస్ పర్యాటకులకు థాయ్‌లాండ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కరోనా వైరస్‌ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి శ్రేతా త‌విసిన్ ప్రయాణికుల‌కు గిఫ్ట్‌లు ఇచ్చి ఫోటోలు దిగారు. అదే సమయంలో పర్యాటక మంత్రి, ఇతర వీఐపీలు షాంఘై నుంచి సుమారు 300 మంది ప్రయాణికులకు స్వాగతం పలికారు. సువర్ణభూమి విమానాశ్రయం చేరుకునే ప్రాంతంలో థాయ్ సంప్రదాయ నృత్యకారులు, వాయిద్యకారులు తమ ప్రదర్శనతో పర్యాటకులను అలరించారు.

Also Read: Beating Muslim student: ముస్లిం విద్యార్థిని కొట్టించిన టీచర్.. సీరియస్ అయిన సుప్రీం కోర్టు

మీడియాతో మాట్లాడిన పీఎం శ్రేత తవిసిన్‌.. ఈ విధానం ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. థాయిలాండ్‌లోని చిన్న పట్టణాలను చైనా పర్యాటకులకు గమ్యస్థానాలుగా ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోందని, వారు ఎక్కువసేపు ఉండడానికి, ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. పర్యాటకుల భద్రతకు సంబంధించి అధికారుల ముందున్న ప్రాధాన్యత ఇదేనన్నారు. థాయ్‌లాండ్‌లో మోసం మరియు కిడ్నాప్ గురించి నివేదికలు, పుకార్లు చైనీస్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో భద్రతే ప్రాధాన్యత అని థాయ్ ప్రధాని పేర్కొ్‌న్నారు.

Exit mobile version