Site icon NTV Telugu

Viral Live Video: అయ్యో మోసం చేసిందే.. లైవ్‌లో చైనీస్ స్ట్రీమర్ అసలు ముఖం చూసి 1.4 లక్షల మంది పరార్!

Filter Fail

Filter Fail

Viral Live Video: సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదని చెప్పడానికి ఈ ఘటన మంచి ఉదాహరణగా పని చేస్తుంది. ఫిల్టర్ల వెనుక దాక్కున్న అందం ఒక్క నిమిషం బయటపడితే ఏమౌతుందో స్టోరీ చదివితే అర్థం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోల వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ‘గ్లామర్’ అంటే కేవలం కెమెరా పనితనం కాదు, అంతకు మించి ‘ఫిల్టర్ల’ మాయాజాలం. యవ్వనంగా, మెరిసిపోయే చర్మంతో కనిపించే చాలా మంది వెనుక అసలు రహస్యం ఏమిటో చైనాకు చెందిన ఓ పాపులర్ లైవ్ స్ట్రీమర్ ఉదంతం బయటపెట్టింది. ఒక చిన్న టెక్నికల్ పొరపాటు ఆమె ఫాలోవర్ల సంఖ్యను తలకిందులు చేసిందంటే మాటలు కాదు.

READ ALSO: Balka Suman Arrest: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతన్‌పల్లిలో హైడ్రామా!

లైవ్‌లో ఏం జరిగిందంటే..
చైనాలో ఒక మహిళా స్ట్రీమర్ లైవ్ నిర్వహిస్తోంది.. అందులో వేలమంది ఫాలోవర్లు పాల్గొన్నారు. లైవ్‌ స్క్రీన్‌పై ఆమె చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, అకస్మాత్తుగా ఆమె వాడుతున్న ‘బ్యూటీ ఫిల్టర్’ మొరాయించింది. క్షణాల్లో ఆమె ముఖంపై ఉన్న మెరుగులు పోయి, ఆమె అసలు రూపం బయటపడింది. ఫిల్టర్‌లో యువతిలా కనిపించిన ఆమె, నిజానికి మధ్య వయస్కురాలు అని తేలిపోయింది. ఆమె అసలు రూపం చూడగానే నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ సెకను నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ వీడియో బయటికి వచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.4 లక్షల మంది ఆమెను అన్‌ఫాలో చేశారు. ఈ సందర్భంగా పలువురు ఫాలోవర్లు ఆమె వీడియోల కింద.. ఇంతకాలం మమ్మల్ని మోసం చేస్తావా? అంటూ కామెంట్స్ చేస్తూ, రకరకాల మీమ్స్‌తో విరుచుకుపడ్డారు.

ఈ ఘటన చూడగానే చాలా మందికి 2019లో వైరల్ అయిన “Your Highness Qiao Biluo” ఉదంతం ఒక్కసారిగా గుర్తొచ్చింది. అప్పట్లో కూడా ఒక స్ట్రీమర్ ఇలాగే ఫిల్టర్ ఫెయిల్ అవ్వడంతో అడ్డంగా దొరికిపోయి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. వర్చువల్ ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ నిజం కాదని ఇది మరోసారి నిరూపించింది.

READ ALSO: Sailu Kampati: మరో రూరల్ డ్రామాతో వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. ఈసారి ఏకంగా బిగ్ బ్యానర్‌లో ఛాన్స్!

Exit mobile version