NTV Telugu Site icon

Paytm: పేటీఎంకు అలీబాబా షాక్..పెట్టుబడులు ఉపసంహరణ

5

5

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు భారీ షాక్ తగిలింది. చైనా ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా పేటీఎం నుంచి పూర్తిగా వైదొలిగింది. పేటీఎం పేరెంట్ కంపెనీ వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్‌లో 2.1 కోట్ల షేర్ల (3.4 శాతం వాటా)ను అలీబాబా శుక్ర‌వారం విక్ర‌యించింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో పేటీఎం నుంచి అలీబాబా 6.26 శాతం, జ‌న‌వ‌రిలో మూడు శాతం వాటాల‌ను విక్ర‌యించింది.

Also Read: Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు

“పేటీఎం స్టాక్స్‌లో 2,59,930 షేర్లను ఒక్కో షేర్ విలువ రూ.535.90 చొప్పున రూ.13.93 కోట్ల విక్ర‌యం జ‌రిగింది. చైనా ఈ-కామ‌ర్స్ సంస్థ అలీబాబా సుమారు ఆరు శాతం వాటాలో 3.1 శాతం విక్ర‌యించింది” అని గ‌త నెల‌లో పీటీఐ ఒక వార్తాక‌థ‌నం ప్ర‌చురించింది. భార‌త్‌లోని ఇత‌ర సంస్థ‌ల్లో అలీబాబా త‌న పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కూడా కనిపిస్తుందని పేర్కొంది. శుక్ర‌వారం పేటీఎం నుంచి అలీబాబా పూర్తిగా వైదొలిగిన‌ట్ల‌యింది. అంత‌కుముందు న‌వంబ‌ర్‌లో ఫుడ్ అగ్రిగేట‌ర్ జొమాటోలో మూడు శాతం వాటాల‌ను అలీబాబా విక్ర‌యించిన సంగతి తెలిసిందే. తాజాగా అలీబాబా త‌న పూర్తి వాటాల‌ను విక్ర‌యించ‌డంతో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్ షేర్ 9 శాతం న‌ష్టంతో రూ.640 పాయింట్ల‌కు ప‌డిపోయింది. చివ‌ర‌కు ట్రేడింగ్ ముగింపు ద‌శ‌లో 7.82 శాతం న‌ష్టంతో రూ.650.75 వ‌ద్ద నిలిచింది.

Also Read: T20 Womens WorldCup: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్..స్టార్ ఓపెనర్ దూరం!