US-Iran Ceasefire: ఇటీవల ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రాత్రి వరకు ఒప్పందం కుదుర్చుకోకపోతే మీ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. కట్‌చేస్తే డెడ్‌లైన్‌కు కొన్ని గంటల ముందే ట్రంప్ తన రూట్ మార్చుకున్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని, రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. మరోవైపు.. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే.. ఈ ఒప్పందానికి సంబంధించి ఘనతను పాకిస్థాన్‌కు ఇచ్చారు ట్రంప్. పాకిస్థాన్ ప్రధానిషెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైనికాధికారి పేర్లను ప్రస్తావించారు. కానీ.. ఈ ఒప్పందం వెనుక ఉన్నది పాకిస్థాన్ కాదట. తెర వెనుక చైనా నడిపిన దౌత్యమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
READ MORE: Heroines – Weird Things : హీరోయిన్స్ విషయంలో హద్దులు దాటుతోన్న అభిమానం
నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో చైనా మౌనంగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో రంగంలోకి దిగింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలమవుతున్న తరుణంలో ఇరాన్‌ను ఒప్పించేందుకు పాక్ స్వయంగా బీజింగ్ సహాయం కోరినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధిని బలవంతంగా తెరిపించేందుకు అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌కు చైనాపై నమ్మకం కుదిరింది. ఇదే అదునుగా డెడ్‌లైన్ దగ్గరపడుతున్న కొద్దీ, చైనా అధికారులు నేరుగా ఇరాన్‌తో చర్చలు జరిపారు. యుద్ధ విరమణకు ఒప్పించారు. ట్రంప్ కూడా చైనా ఒత్తిడి పనిచేసిందని పరోక్షంగా అంగీకరించారు. ఇదిలా ఉండగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ప్రధాని చేసిన పోస్ట్ మెసేజ్‌లో “Draft – Pakistan’s PM message” అని ఉండటం చూస్తుంటే, ఆ సందేశాన్ని పాక్ స్వయంగా రాయలేదని, అమెరికా లేదా మరే ఇతర దేశమో రాసి ఇచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ కూడా పాకిస్థాన్‌ను ఒక తటస్థ దేశంగా చూడకుండా, అమెరికా చేతిలో కీలుబొమ్మగా భావించి నేరుగా చర్చలకు నిరాకరించింది. అందుకే ఇరాన్‌ను టేబుల్ వద్దకు తీసుకురావడానికి చైనా జోక్యం అనివార్యమైంది.
READ MORE: Vignesh Shivan: అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!
ఈ చర్య వల్ల చైనాకు వచ్చే లాభం ఏంటనే ప్రశ్న మీకూ వచ్చే ఉంటుంది. చైనా కేవలం శాంతి కోసమే ఈ పని చేయలేదు. దాని వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురు దిగుమతి చేసుకునే దేశం చైనా. యుద్ధం ముదిరితే ఇరాన్ నుంచి వచ్చే చమురు ఆగిపోతుంది. ఇలా తన ప్రయోజనాలు కాపాడుకోవడంలో చైనా ఫలించింది. అంతేకాదు.. హార్ముజ్ జలసంధి మూతపడితే చమురు ధరలు పెరిగి చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పటికే వెనిజులా చమురుపై అమెరికా పట్టు సాధించడంతో, చైనాకు ఇరాన్ చమురు కీలకంగా మారింది. నిజానికి చైనా పాత్ర కీలకమని తెలిసినా, ట్రంప్ తన అధికారిక ప్రకటనలో పాకిస్థాన్‌కు మాత్రమే క్రెడిట్ ఇచ్చారు. చైనాను సమానమైన శక్తిగా గుర్తించడం ఇష్టం లేకనే ట్రంప్ ఇలా చేసి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, వచ్చే నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్న ట్రంప్‌కు, ఈ యుద్ధ విరమణ ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించింది. అన్ని అంశాలను పరిశీలిస్తుంటే ఇరాన్ ఒప్పందం వెనుక చైనా మాస్టర్ ప్లాన్ కనిపిస్తోంది. పాకిస్థాన్ ప్రధాని మాత్రం కీలు బొమ్మలా కనిపిస్తున్నారు.
