NTV Telugu Site icon

India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాలని కోరిన చైనా..భారత్ నిరాకరణ

New Project

New Project

నాలుగు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనాకు నేరుగా విమానాలను ప్రారంభించాలని చైనా స్వయంగా అభ్యర్థిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. చైనాకు నో చెప్పింది. జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను మరియు ప్రయాణాన్ని నిషేధించింది భారత్. నాలుగేళ్ల తర్వాత నేరుగా ప్రయాణీకుల విమానాలను పునఃప్రారంభించాలని చైనా భారత్‌పై ఒత్తిడి తెస్తోందని.. అయితే భారత ప్రభుత్వం చైనాకు నో చెప్పిందని అధికారులు తెలిపారు.

READ MORE: India- Bangladesh: నేడు భారత్‌లో బంగ్లాదేశ్‌ ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై చర్చ..!

జూన్ 2020లో, వివాదాస్పద హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని, అక్కడ 20 మంది భారతీయ సైనికులు మరియు నలుగురు చైనా సైనికులు మరణించారని తెలిసిందే. ఘర్షణ జరిగినప్పటి నుంచి, చైనా కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడంపై భారత్ నిషేధం విధించింది. వందలాది ప్రముఖ యాప్‌లను కూడా నిషేధించింది. టిక్‌టాక్ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఇందులో ఉన్నాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఒక ప్రకటనలో రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం చైనాతో అదే దిశలో పనిచేస్తుందని ఆశిస్తున్నామన్నారు.