Site icon NTV Telugu

China Piece : దేశభక్తి రగిలిస్తున్న ‘భగ భగ’ సాంగ్.. నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ‘చైనా పీస్’ అప్‌డేట్!

Chaina Piece

Chaina Piece

యువ నటులు నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చైనా పీస్’. యూనిక్ స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తన టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు హ్యూమర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి తాజాగా ‘భగ భగ’ అనే పవర్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట ఇప్పుడు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

Also Read  : Sara Arjun : పనితోనే గుర్తింపు కావాలి.. స్టార్ ట్యాగ్ కాదు

కార్తీక్ అద్భుతమైన ట్యూన్ అందించగా, కాల భైరవ తన పవర్ ఫుల్ వాయిస్‌తో ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. రెహమాన్ రాసిన లిరిక్స్ ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఫిబ్రవరి చివర్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఒక విభిన్నమైన స్పై థ్రిల్లర్‌ను చూడాలనుకునే వారికి ‘చైనా పీస్’ మంచి ఛాయిస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

 

Exit mobile version