NTV Telugu Site icon

China: చేజేతులా రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు.. ఇప్పుడేమో లబోదిబో అంటున్నాడుగా

China (1)

China (1)

China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్‌కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY అంటే సుమారు రెండు కోట్ల రూపాయలు, అలాగే మరికొన్ని స్థిరాస్తులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి ముగ్గు చూపినప్పటికీ అతడు వాటిని తిరస్కరించాడు. దీనితో చైనా ప్రభుత్వం ఏమి చేయలేక అతడి ఇంటి చుట్టూ నేషనల్ హైవేని నిర్మించింది. ఈ నేషనల్ హైవే అతి త్వరలో మొదలు కాబోతోంది. ఇంతవరకు బాగున్న ప్రస్తుతం పరిస్థితి హువాంగ్ పింగ్ కు పెద్ద తలనొప్పిలా మారింది.

Also Read: R. Satyanarayana: మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత.. పలువురు నేతలు సంతాపం

నేషనల్ హైవే నిర్మాణ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు, అలాగే భారీ ధూళి వల్ల తాము బాధపడుతున్నట్లు తెలిపాడు. హైవే పనులు జరుగుతున్న సమయంలో తాము ఎక్కువసేపు దగ్గరలోని పట్టణ కేంద్రంలో గడుపుతున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ నిర్మాణం పూర్తి అయ్యి వాహనాల రాకపోకలు హైవే ప్రారంభమైతే ఈ శబ్దాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు వాపోతున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం సంబంధించి పశ్చత్తాపం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలం వెనికి వెళ్తే, తాను తన ఇంటి కూల్చివేతకు అంగకరిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అలా చేయకపోవడం వల్ల పెద్ద తలనొప్పిగా మారిందని వాపోతున్నాడు. అయితే, ప్రస్తుతం తన ఇల్లు చైనా దేశం అంతటా ఓ ప్రసిద్ధ చెందిన టూరిజం స్పాట్గా మారిందని చెప్పుకొచ్చాడు. చాలామంది తన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడడానికి, ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.