NTV Telugu Site icon

Covid Cases: చైనాను వణికిస్తున్న కరోనా.. వారానికి 6.5 కోట్ల మందికి వైరస్..

China Covid

China Covid

చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్‌ మాసంలో అదికాస్త గరిష్ట​ స్థాయికి చేరుకుంటుంది. జూన్ చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్‌ల నిల్వను పెంచే దిశగా చైనా సర్కార్ చర్యలు ప్రారంభించింది. అలాగే ఈ కొత్త వేరియంట్‌ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ చైనీస్‌ ఎపిడెమియాలజిస్ట్‌ ఝాంగ్‌ నాన్షాన్‌ వెల్లడించింది.

Also Read : Pawan Kalyan: తగ్గేదేలే.. OG విలన్‌గా స్టార్ హీరో?

అలాగే జనాభాలో వృద్ధుల మరణాల పెరుగుదలను నివారించడానికి శక్తిమంతమైన టీకా బూస్టర్‌ తో పాటు యాంటీ వైరల్‌ మెడిసిన్స్ ను సిద్ధం చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తుంది. ఇక బీజింగ్‌ సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం.. గత నెలలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ చివరి నుంచి ఈ కేసుల సంఖ్య వీపరీతంగా పెరగడం ప్రారంభమైందని వెల్లడించింది.

Also Read : Rs 75 Coin: ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్.. ఆ రోజే రూ.75 నాణెం విడుదల

ఇదిలా ఉండగా, గత ఏడాదిలో శీతకాలంలో జీరో కోవిడ్‌ విధానాన్ని చైనా ప్రభుత్వం ఎత్తివేసినప్పటి నుంచి అనూహ్యంగా కరోనా కేసులు నమోదవ్వడమే గాక దేశంలో దాదాపు 85 శాతం మంది అనారోగ్యం బారినపడ్డారు. కాగా యూనివర్సిటీ హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌‌ హెల్త్‌ ఎపిడెమియాలజిస్ట్‌ మాత్రం ప్రస్తుత వేవ్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటమే గాక మరణాలు కూడా తక్కువగానే నమోదవ్వుతాయని తెలిపింది. ఇది తేలికపాటి వేవ్‌గానే పరిగణిస్తున్నాం.. కానీ ఈ కరోనా మహమ్మారీ ఇప్పటికీ ‍ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించడం బాధకరమని ఎపిడెమియాలజిస్ట్‌ తెలిపింది.