Site icon NTV Telugu

Badminton Player Death: పెను విషాదం.. గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల ప్లేయర్!

Badminton Player Death

Badminton Player Death

China Badminton Player Death: బ్యాడ్మింటన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం చైనా షట్లర్‌ జాంగ్‌ జిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. 17 ఏళ్ల జాంగ్‌ జిజీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది.

Also Read: Abhay Verma: నేను అబ్బాయిని అని చెప్పినా.. కుర్రాళ్లు వదల్లేదు: హీరో

ఆదివారం రాత్రి జపాన్‌ ఆటగాడు కజుమాతో సింగిల్స్‌లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జాంగ్‌ జిజీ తలపడ్డాడు. తొలి గేమ్‌లో స్కోరు 11-11తో ఉండగా.. అస్వస్థత కారణంగా జాంగ్‌ జిజీ కోర్టులోనే కుప్పకూలాడు. వెంటనే అతడికి ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జాంగ్‌ జిజీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జాంగ్‌ జిజీ మరణంపై భారత స్టార్‌ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మరణ వార్తతో తన హృదయం ముక్కలైందని ఎక్స్‌లో సింధు పోస్టు చేసింది.

Exit mobile version