దేవుడి. దేవతలకి నీళ్ళు, పాలు, పళ్ళరసాలు, తేనెతో అభిషేకం చేస్తుంటాం. కానీ ఆ దేవతాముర్తులకు వెరైటీగా అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే స్వామి కరుణిస్తారని, మనం కోరిన వరాలు అందిస్తాడని నమ్ముతారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివ స్వామికి కారంతో అభిషేకాన్ని జరిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమo వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు, స్థానికులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు.
Read Also: Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు
అనంతరం శివ స్వామి ప్రత్యంగరా దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తరువాత దేవి ఆవాహనలో ఉన్న శివ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 50 కేజీల కారంతో శివ స్వామిని అభిషేకించారు. హిరణ్యకశికుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించింది అని పండితులు చెబుతారు. ప్రత్యంగిర హోమం, పూజల్లో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కారంతో అభిషేకం ఇప్పుడు వైరల్ అవుతోంది. కారం చేత్తో తాకితేనే మండుతుంది. అలాంటిది కిలోల కొద్దీ కారంతో అభిషేకం చేస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించండి.
Read Also: Tollywood: నటుడు, సీనియర్ జర్నలిస్ట్ మురళీ కన్నుమూత!
