NTV Telugu Site icon

Tragedy : ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యానికి చిన్నారి బలి

Baby Died

Baby Died

ఆస్పత్రి యాజమాన్యం చేసిన తప్పు ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే అధికారుల తీరుతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలలో 45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. బాబు మృతికి కారణాన్ని తెలుసుకునేందుకు 10 రోజుల తర్వాత మృతదేహాన్ని బయటికీ తీసి పోస్టుమార్టం చేశారు. ఈ నెల 5న జ్వరంతో ఉన్న 45 రోజుల పసికందు దష్విక్ ని తల్లిదండ్రులు అనురాధ, ప్రభులింగం సంగారెడ్డిలోని శిశురక్ష ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

Mahabubabad: విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు..

పరీక్షలు చేయగా చిన్నారికి డెంగ్యూ వచ్చిందని వైద్యులు చెప్పారు. ఈ నెల 8న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా బాబుకి సీరియస్ గా ఉందని నిలోఫర్ కి రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు శిశురక్ష ఆస్పత్రి డాక్టర్లు. నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాబు చనిపోయి 3 గంటలు అవుతుందని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి బాబుని ఖననం చేశారు. మరునాడు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని శిశురక్ష ఆస్పత్రి ల్యాబ్ ని DMHO సీజ్ చేశారు. దీంతో తమ బాబు మృతికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేయగా. నేడు బాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Narayana Swamy: నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. వెళ్లాలనుకుంటే అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..!