NTV Telugu Site icon

Chikoti Praveen Meets MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యేతో క్యాసినో కింగ్ భేటీ

Chi

Chi

Chikoti Praveen Meets MLA Raja Singh: గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కలుసుకున్నారు. అనంతరం ఆయన మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. కోఠి ఇసామియా బజార్‌లో గల సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి రాజా సింగ్ అని చీకోటి ప్రవీణ్ కితాబిచ్చారు. తను కూడా హిందుత్వవాదినేనని తెలిపారు. ఓ హిందూత్వవాదిగా రాజాసింగ్‌ను కలవడానికి వచ్చానని తెలిపారు. ఆయనకు తనకు మద్దతు ఉంటుందని, హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని ప్రకటించారు.

Read Also: Sabitha Indrareddy: ఇంటర్ విద్యలో మార్పులపై కమిటీ .. మంత్రి సబిత క్లారిటీ

తాను ఎవరికీ భయపడనని బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడే వారి తోలు తీస్తానని ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై ఈడీ దాడులు జరిగినా, భయపడలేదన్నారు. అలాగే తాను ఏ పార్టీలో చేరనని తెలిపారు. బీజేపీలో చేరుతాడన్న వార్త ప్రస్తుతానికి అవాస్తమని స్పష్టంచేశారు. అలాగే సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేటీఆర్ మీద పోటీ చేస్తాననేది పుకార్లు మాత్రమే అన్నారు. తనకు ఏ పార్టీలోనే చేరే ఆలోచన లేదని తెలిపారు. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చికోటీ ప్రవీణ్‌ను కలిసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన కథను ఆర్జీవీ సినిమాగా తీసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. తాము మాట్లాడిన సమయంలో ఆర్జీవీ తెలిపారని వివరించారు. రామ్ గోపాల్ వర్మ పిలిచి తనకు సినిమాల్లో ఆఫర్ ఇస్తే హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ సినిమాకు నిర్మాతగా మాత్రం వ్యవహరించనని తెలిపారు.