NTV Telugu Site icon

Revanth Reddy: పద్మశ్రీ మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన ముఖ్యమంత్రి..

Cm Revanth

Cm Revanth

ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం అందించింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. కాగా.. ఆ ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగిలయ్యకు అందజేశారు. మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా ఉన్నారు. కాగా.. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: New airlines: విమాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ

పొట్ట కూటి కోసం పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగినా.. అంతరించిపోతున్న కళకు ప్రాచుర్యం కల్పించి జీవం పోశారు కిన్నెర మొగిలయ్య. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కారణంగా సినిమాటిక్‌గా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు మొగిలయ్య. ఆయన వాయిస్తున్న వాయిద్యం, కళ అత్యంత అరుదైంది కావడంతో మీడియా బాగా ఫోకస్ పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి చిన్నా చితకా యూట్యూబ్ ఛానెళ్ల వరకు ఆయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశారు. దాంతో మొగిలయ్య ప్రతిభ, కిన్నెర వాయించే కళకు ఆయన చేసిన సేవ కేంద్రం దృష్టికి వెళ్లడంతో ఏకంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డ్ వరించింది.

Read Also: Mpox Clade 1b: ఇండియాలో తొలిసారిగా ప్రమాదకరమైన ఎంపాక్స్ వెరైటీ గుర్తింపు..

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుతో జాతీయ స్థాయిలో ఫేమస్ అయిపోయిన మొగిలయ్యను అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్‌కు పిలిపించి ఘనంగా సత్కరించారు. రూ.కోటి నజరానాతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల భూమి కూడా కేటాయించారు. 12 మెట్ల కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసేలా 8వ తరగతి విద్యార్ధులకు పాఠ్యాంశంగా చేర్చింది ప్రభుత్వం. అలాగే తెలంగాణ సాంస్కృతిక శాక మొగిలయ్య జీవితంపై డాక్యుమెంటరీని రూపొందించింది.