NTV Telugu Site icon

Revanth Reddy: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి..

Revanth Reddy In Telangana Assembly

Revanth Reddy In Telangana Assembly

Revanth Reddy In Telangana Assembly: నేడు మొదలైన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భాగంగా మొదట అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ., ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరం. సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న కోరిక అని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరంటూ వాపోయాడు.

Budget 2024 : బడ్జెట్లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ప్రకటించిన నిర్మలా సీతారామన్

లాస్య బ్రతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం.. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాని ఆయన అన్నారు.

Breaking News: తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత..