NTV Telugu Site icon

Odisha: శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు..

Odissa

Odissa

Odisha : ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ( Mohan Charan Majhi ), ఉప ముఖ్యమంత్రులు కెవి సింగ్ డియో ( KV Singh Deo ), ప్రవతి పరిదా ( Pravati Parida) లతోపాటు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) మంగళవారం భువనేశ్వర్‌ లో 17వ ఒడిశా శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ప్రొటెం స్పీకర్ రానెంద ప్రతాప్ స్వైన్ ముఖ్యమంత్రి, పట్నాయక్‌ తో సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జూన్ 19 వరకు కొనసాగుతుంది. జూన్ 20న స్పీకర్ ఎన్నిక జరగనుంది.

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ.. ఓపెన్ అయిన కుమార్తె!

సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించగా, ఆ తర్వాత స్థానాల్లో బీజేడీ (51), కాంగ్రెస్ (14), సీపీఎం (1), స్వతంత్రులు (3) నిలిచారు. 147 మంది సభ్యులున్న ఒడిశా అసెంబ్లీలో 82 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారుండడం విశేషం. మాఝీ సభా నాయకుడిగా ఉండగా., బీజేడీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతిపక్ష నాయకుడిగా (ఎల్‌ఓపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి