NTV Telugu Site icon

Chicken prices: నాన్‌వెజ్‌ ప్రియులకు షాక్‌.. ముక్క కొనేదెలా..? ముద్ద దిగేదెలా..?

Chicken

Chicken

Chicken prices: నాన్‌వెజ్‌ ప్రియులకు షాక్‌ తగిలినంత పని అవుతోంది.. మటన్‌ ధరలో పాటు చికెన్‌ ధర కొండెక్కుతోంది.. అసలే కరోనా తర్వాత ఎగ్స్‌, మటన్‌, చికెన్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది.. అది ఇంకా కొనసాగుతూనే ఉంది.. అయితే, వేసవి దెబ్బకు చికెన్‌ ధర పైపైకి కదులుతోంది.. ముక్కలేనిదే ముద్ద దిగని వారు ఎంతో మంది తయారయ్యారు.. వారం మొత్తం సంగతి ఎలా ఉన్నా.. వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. చికెన్, మటన్, ఫిష్ ఇలా ఎదో ఒక నాన్‌వెజ్‌ ఇంట్లో ఉండాల్సిందే.. లేదా.. నచ్చిన హోటల్‌ నుంచి మెచ్చిన ఫుడ్‌ అయినా తెచ్చుకోవాలి.. లేదా ఆర్డర్‌ పెట్టాలి.. కానీ, నాన్‌వెజ్‌ ధరలు ఇప్పుడు వంటింటికి భారంగా మారుతున్నాయి.

Read Also: Lord Hanuman: “హనుమంతుడు ఆదివాసీ”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

కిలో మటన్ ధర రూ.800కి పైగానే పలుకుతుండగా.. కిలో చికెన్ ఏకంగా 300 రూపాయాలను క్రాస్‌ చేసి.. రూ.350కి చేరింది.. దీంతో మాసం తినేందుకు సామాన్య ప్రజలు జంకే పరిస్థితి వచ్చింది.. వారం మొత్తం ఎలా ఉన్నా సరే.. ఆదివారం వచ్చిందంటే నీచు ఉండాల్సిందే అనేవారు కూడా.. కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారట.. నాన్‌వెజ్‌ తినాలంటే పావు కేజీతోనో, అర కేజీతోనే సరిపెట్టుకుంటున్నారట. అయితే, ప్రతీ ఏడాది ఎండలు పెరిగాయంటే.. చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఈ ఏడాది కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండడంతో.. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.200 నుంచి 250 మధ్య పలికింది.. ఇప్పుడు ఎండలు దంచికొట్టె భరణి కార్తె, రోహిణి కార్తె పోయి.. మృగశిర కార్తె వచ్చినా.. ఎండలు మాత్రం తగ్గడం లేదు.. దీంతో.. కొన్ని రోజుల వ్యవధిలోనే ధరలు ఆకాశాన్నంటాయి.. కిలో చికెన్‌ రూ.300 దాటి.. ఆ తర్వాత రూ.350కు చేరింది.. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో, విజయవాడలో కిలో చికెన్ ధర రూ.350గా ఉంది.. ఇక, బోన్ లెస్ చికెన్ అయితే రూ.700లకు చేరగా.. లైవ్ బర్డ్ ధర రూ.166 పలుకుతోందని చెబుతున్నారు.. ఓవైపు ఎండల తీవ్రతతో కోళ్లు మృత్యువాత పడడం ధరల పెరుగుదలకు ఒక కారణం అయితే.. మరోవైపు పెళ్లిల్ల సీజన్ తో చికెన్‌కు డిమాండ్‌ పెరగడం కూడా మరో కారణంగా చెబుతున్నారు వ్యాపారులు..