Teacher Suspended: గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు అందరూ చదువుకునే ఉంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలతో సమానం. మనకు జ్ఞానాన్ని బోధించే ప్రత్యక్ష దైవం అని అర్థం. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో ఉపాధ్యాయుడు చేరిపోయాడు.విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చి దిద్దాల్సిన గురువు.. వారి చేతులతో మసాజ్ చేయించుకున్నాడు.
Also Read: Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్డుతో కొట్టి..
ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో మసాజ్ చేయమని విద్యార్థులను బలవంతం చేశాడనే ఆరోపణలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శుక్రవారం ఒక అధికారి తెలిపారు. సేంద్రిముండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న అతడిని గురువారం సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సంజయ్ గుప్తా తెలిపారు. మసాజ్ చేయమని పిల్లలను అడిగారని, వారు నిరాకరించినట్లయితే కొట్టారని కొంతమంది విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నివేదిక అందించడంతో సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. సంబంధిత క్లస్టర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్‌కు కూడా నోటీసు అందించామని, తదుపరి విచారణ జరుగుతోందని డీఈవో సంజయ్ గుప్తా తెలిపారు.