Site icon NTV Telugu

5 year old boy posted as constable : కానిస్టేబుల్ గా ఐదేళ్ల బాలుడు నియామకం

5yeats Boy

5yeats Boy

ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో ఐదేళ్ల బాలుడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియమితులై విధులు నిర్వహిస్తున్నాడు.. ఆ చిన్నారి నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేసింది. ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ పోస్టులో నియమించడంలో అర్థం ఏమిటనే ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతుంది. పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కానిస్టేబుల్ ఈ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. రాజ్ కుమార్ రాజ్వాడే ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు అని ఎస్పీ భావనా గుప్తా పేర్కొన్నారు. ఇప్పుడ ఆయన కుమారుడు రాజ్వాడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. అతని తండ్రి మరణం తర్వాత, జార్ఖండ్ పోలీసులు 5ఏళ్ల నమన్ ను కానిస్టేబుల్ గా నియమించారు.

Also Read : MLC Kavitha: మహిళా బిల్లును తీసుకురావాలి.. కవిత ట్వీట్‌ వైరల్‌

నమన్ వయసు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్సీ నమన్ కు అందజేశారు. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ రాజ్వాడ్ 2021 సెప్టెంబర్ 3న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కానిస్టేబుల్ భార్య, ఐదేళ్ల కుమారుడు నమన్ లు.. రాజ్ కుమార్ రాజ్వాడేపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, ఆయన మరణం తర్వాత ఛత్తీస్ గఢ్ పోలీసు శాఖ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. జీతభత్యాలు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు రాజ్ కుమార్ కుమారుడు నమన్ కు కారుణ్య నిమామకం కింద కానిస్టేబుల్ గా నియమించారు.

Also Read : Earthquake: ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో వరస భూకంపాలు..

అయితే ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ పోస్టుకు నియమించడంలో అర్థం ఏమిటనే ప్రశ్న కూడా పలువురి మదిలో మెదులుతోంది. నిబంధనల ప్రకారం ప్రస్తుతం చైల్డ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వరిస్తున్న నమన్ కు 18 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి కానిస్టేబుల్ గా హోదా లభిస్తుంది. అదే సమయంలో ఐదేళ్ల చిన్నారికి ఎస్పీ భావనా గుప్తా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భావనా గుప్తా నమన్ రాజ్వాడేక నియామక పత్రాన్ని ఇస్తూ ఇప్పుడు మీరు కూడా పోలీస్ అయ్యారని చెప్పడం అందులో కనిపిస్తుంది.

Exit mobile version