NTV Telugu Site icon

Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు

Chevireddy Mohith Reddy

Chevireddy Mohith Reddy

Chevireddy Mohith Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు. నిన్న ఆయనను తిరుపతి పోలీసులు బెంగళూరులో నుండి దుబాయ్ వెళుతుండగా అదుపులో తీసుకున్నారు. ఇవాళ ఉదయం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారించి నోటీసు ఇచ్చారు. అయితే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారని మోహిత్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: Paris Olympics 2024: భారత్‌ను ఊరిస్తున్న రెండు పతకాలు.. నేటి పూర్తి షెడ్యూల్ ఇలా..

సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతామన్నారు. తాము బతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతామన్నారు. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారని.. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటూ కామెంట్స్‌ చేశారు. అనంతరం ఎస్వీ వర్శిటి వద్ద శాంతియుత నిరసనగా దిగారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అక్రమంగా తమపై కేసులు పెట్టారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు.