Site icon NTV Telugu

Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

Mohith Reddy

Mohith Reddy

Chevireddy Mohith Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన గణపతిరెడ్డి, భానుకుమార్‌రెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ముందస్తు ప్రణాళికతో రాడ్లు, సుత్తి, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.

Read Also: Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 3 రోజుల పాటు కొనసాగనున్న వరద ప్రవాహం

పులిపర్తి నానిపై హత్యాయత్నం ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు.ఇటీవల ఈకేసులో 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును సైతం ఆశ్రయించారు. బెయిల్‌ పిటిషన్‌ స్వీకరించి విచారణ వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్ట్ అయిన మోహిత్ రెడ్డిని తిరుపతికి తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

Exit mobile version