Site icon NTV Telugu

Cheteshwar Pujara: మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం..

Cheteshwar Pujara

Cheteshwar Pujara

Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుజారా బావమరిది జీత్ పబారి ఈ రోజు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. గత ఏడాది నవంబర్ 26న పబారిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా వ్యాఖ్యానిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది.

READ ALSO: Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం..

నవంబర్ 2024లో పూజారా బావమరిది జీత్ పబారిపై అత్యాచారం ఫిర్యాదు నమోదైంది. వాస్తవానికి జీత్‌పై ఆయనకు కాబోయే భార్య అత్యాచారం ఆరోపణలు చేసింది. రాజ్‌కోట్‌కు చెందిన ఆ మహిళ, తమ నిశ్చితార్థం తర్వాత జీత్ తనతో చాలాసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత అతను ఎటువంటి కారణం లేకుండా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇదే సమయంలో పూజారా పేరుతో ఫిర్యాదు చేసిన మహిళను పదే పదే బెదిరించారని కూడా పలు ఆరోపణలు వచ్చాయి. అలాగే తనపై జీత్ పబారిపై దాడి చేశాడని కూడా ఆ మహిళ ఆరోపించింది. వీటన్నింటి కారణంగా జీత్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని సమాచారం.

పలు నివేదికల ప్రకారం.. రాజ్‌కోట్‌లో నివసించే జీత్ పబారి ఈ రోజు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆయనను ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.

READ ALSO: Manasantha Nuvve Re-Release: థియేటర్స్‌లోకి ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమా..

Exit mobile version