NTV Telugu Site icon

Bajaj Chetak: బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Chetak

Chetak

బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్ 3201 ధర రూ. 1.29 లక్షలు. కాగా.. ఈ స్కూటర్ ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే.. కొత్త చేతక్ 3201 డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌ల రూపంలో ప్రత్యేక అప్‌గ్రేడ్‌లను పొందింది.

Read Also: Sheikh Hasina: అగ్ర రాజ్యం కుట్రకు హసీనా బలైందా? బలపరుస్తున్న కొత్త అనుమానాలివే!

బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్
కొత్త చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ టోన్-ఆన్-టోన్ ఎంబోస్డ్ డీకాల్స్.. క్విల్టెడ్ సీట్ల రూపంలో ప్రత్యేక మార్పులను చేసింది. ఈ స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌, బలమైన స్టీల్ బాడీని కలిగి ఉంటుంది. మోడల్ నీటి నిరోధకత కోసం IP 67 రేట్ చేయబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 136 కి.మీ ప్రయాణించవచ్చు. ఇది అరై (ARAI సర్టిఫైడ్) ద్రువీకరించిన పరిధి. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 73 కి.మీ ప్రయాణిస్తుంది.

ఫీచర్లు
ఈ స్కూటర్ ఫీచర్ విషయానికొస్తే.. యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్.. ఆటో హజార్డ్ లైట్లతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

Show comments