Cherlapally Drug Case: దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?.. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారా?
- చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్
- శ్రీనివాస్, విజయ్‌కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?
- ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్‌కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?.
చర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్‌తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ముంబై పోలీసులు కోర్టును అభ్యర్థించారు.
Also Read
- Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
- AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
- INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
మరోవైపు ఈ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్.. తాను నిర్దోషినని చెప్పే ప్రయత్నం చేశాడు. చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో కేవలం రీసెర్చ్ చేస్తానన్నాడు. అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ కంపెనీకి కావాల్సిన డ్రగ్స్ కోసమే రీసర్చ్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతే కానీ డ్రగ్స్ తయారు చేయడం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి సరుకు నా దగ్గర లేదని చెప్పాడు.
చర్లపల్లి వాగ్దేవి ఫార్మా కంపెనీ యజమాని శ్రీనివాస్ వోలేటిని మీరా భయందర్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. డ్రగ్స్ తయారు చేస్తున్న తానాజీ తోపాటు విజయ్‌ని కోర్టులో హాజరుపరచగా 15 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. వీళ్లతోపాటు దాదాపు 50 వేల లీటర్ల కెమికల్స్, 950 కిలోల డ్రగ్ పౌడర్‌ను కూడా కోర్టు ముందు ఉంచారు. ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారని.. ఈ కేసులో నిందితులకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందని పోలీసుల తరఫు న్యాయవాదులు వాదించారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్నారని తెలిపారు.
మరోవైపు ఈ కేసులో ముంబై పోలీసులు మొదటి నుంచి చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఫాతిమా అనే మహిళ ద్వారా హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ గురించి వారికి పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడి నుంచి ఫాతిమాను హైదరాబాద్ పంపించారు. ఆమె ఓ సాధారణ పర్యాటకురాలిగా హైదరాబాద్ వచ్చి.. 200 గ్రాముల మెఫిడ్రిన్‌ను ముంబై తీసుకెళ్లింది. తర్వాత ముంబై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి చర్లపల్లిలో డ్రగ్ రాకెట్ భరతం పట్టారు. ఈ కేసుతో ఈగల్, రాచకొండ పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఇందులో చాలా పెద్ద మనుషులు ఉన్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!