Site icon NTV Telugu

CSK vs DC: సీఎస్కే ముందు భారీ టార్గెట్.. హాఫ్ సెంచరీలతో రాణించిన వార్నర్, పంత్

Dc

Dc

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషబ్ పంత్ (51) పరుగులతో రాణించారు.

Read Also: IPL 2024: పతిరణ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి మరీ..!

ఓపెనర్ గా బరిలోకి దిగిన పృథ్వీషా 43 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించాడు. మిచెల్ మార్ష్ (18), ట్రిస్టన్ స్టబ్స్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (7), అభిషేక్ పోరెల్ (9) పరుగులు చేశారు. ఇక.. సీఎస్కే బౌలర్లలో మతీషా పతిరణా 3 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా, ముస్తాఫిజుర్ రెహమన్ తలో వికెట్ తీశారు.

Read Also: Free Beer and Whisky: “పేదవారికి ఉచితంగా విస్కీ, బీర్ ఇస్తాం”.. ఎంపీ అభ్యర్థి విచిత్రమైన హామీ..

Exit mobile version