NTV Telugu Site icon

CSK vs MI: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఫీల్డింగ్ ఎంచుకున్న రితురాజ్ గైక్వాడ్

Csk Vs Mi Toss

Csk Vs Mi Toss

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట ముంబై బ్యాటింగ్ చేయనుంది. కాగా.. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ రితురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే జట్టు కొత్త ఉత్సాహంతో ప్రవేశిస్తుంది. రెండు జట్లు లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ నేతృత్వంలోని చెన్నై, ముంబై జట్లు చెరో 5 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.

READ MORE: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పుల వివాదంతో యువకుడి దారుణ హత్య

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

READ MORE: Rajamandri: మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందని తల్లి, కూతుళ్ల హత్య

కాగా.. చెపాక్ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సీఎస్‌కే ఎప్పటిలాగే తమ జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లను కలిగి ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లు చెన్నై బౌలింగ్ దళాన్ని బలపరిచారు. ఎంఐ జట్టులో ముజీబ్ ఉర్ రెహమాన్, మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్లు ఉన్నప్పటికీ, పేస్ దాడిలో బుమ్రా లేని లోటును భర్తీ చేయడం సవాలుగా మారింది. చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న ఈ రెండు జట్లకు గత సీజన్ అంతగా అనుకూలించలేదు. ముంబై ఇండియన్స్ గత సీజన్‌లో చివరి స్థానానికి పడిపోయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తృటిలో ప్లేఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. ఈ సారి ఏం జరుగుతోందో చూడాల్సి ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, ఎమ్‌ఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు