NTV Telugu Site icon

Vishal: హీరో విశాల్ పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. మ్యాటరేంటంటే..?

Vishal

Vishal

Chennai High Court Fire on Hero Vishal: తాజాగా కోలీవుడ్‌ హీరో విశాల్‌ పై న్యాయస్థానం మండిపడింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, విశాల్‌ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు రాయడంతో.. అందుకు సంబంధించి లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్‌ కోర్టుకు హాజరయ్యాడు. అసలు నేను ఖాళీ కాగితం పై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్‌ జరిగిందన్న విషయమే తనకి తెలియదన్నాడు. అయితే, హీరో విశాల్ వ్యాఖ్యలపై కోర్ట్ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీరేమైనా తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా..? ఇదేం సినిమా షూటింగ్‌ కాదు.. సరిగ్గా సమాధానం ఇవ్వండి అని తెలిపింది.

Poco M6 Plus 5G: ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ గురూ..ఫీచర్స్ అదుర్స్!

ఇకపోతే., విశాల్‌.. ఫైనాన్షియర్‌ అన్బచెలియన్‌ వద్ద తీసుకున్న రూ. 21. 29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ డబ్బులను ఇచ్చింది. ఈ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్‌ నిర్మించే సినిమా హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదిరించుకున్నారు. అయితే., విశాల్‌ మాత్రం ” వీరమె వాగై చూడమ్‌ ” సినిమా హక్కులను లైకాకు బదులు వేరే సంస్థకు అమ్మేశాడు. దీంతో 2 సంవత్సరాల క్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించగా.. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో నేడు ఈ కేసు విచారణ జరిగింది.

TTD EO Syamala Rao: శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్లపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

Show comments