NTV Telugu Site icon

Cheetah Attack : నా మనవడ్ని చిరుత మేక పిల్లను ఎత్తుకెళ్ళినట్లు ఎత్తుకెళ్ళింది..

Cheetah Attack

Cheetah Attack

తిరుమల 7వ మైలు కాలిబాటలో బాలుడిపై దాడి చేసిన చిరుతపులి నిన్న రాత్రి పట్టుబడింది. అయితే.. ఈ ఘటనపై చిరుత పులి దాడి ఘటన తరువాత ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు కౌశిక్ తండ్రి, తాతాయ్య. చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ తాత తిమ్మయ్య మాట్లాడుతూ.. ‘కౌశిక్ …జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నడుస్తుండగా నా మనవడ్ని చిరుత మేక పిల్లను ఎత్తికెళ్ళినట్లు ఎత్తుకెళ్ళింది. బాబు కనపడకుండా పోవడంతో భక్తుల కాళ్ళు మీద పడి కాపాడాలని వేడుకున్నాను. కొద్దిమంది పట్టించుకోలేదు.. మరికొందరు స్పందించి కాపాడటానికి అడవిలోకి వచ్చారు. చిరుత వెనక నేను పరిగెత్తాను, అయితే అది వేగంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న పోలీసులు వేగంగా స్పందించారు. బాబు దొరుకుతాడని అనుకోలేదు. వెంకటేశ్వర స్వామి దయతో నా మనవడు బయటపడ్డాడు’

Also Read : Cheteshwar Pujara Gavaskar: కోహ్లీ, రోహిత్ కూడా విఫలమయ్యారు.. పుజారాను మాత్రమే ఎందుకు బలి చేశారు!

ఎన్టీవీతో బాబు తండ్రి కొండా మాట్లాడుతూ.. ‘తమ్ముడికి సంబంధించి మొక్కు ఉంటే తిరుమల వచ్చాము. బాబు తన తాతతో వెనుక వస్తున్నాడు, మేము ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం. చిరుత ఎత్తుకొని వెళ్ళన తరువాత నాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము ఆ ప్రాంతానికి వచ్చాము. బాబును చిరుత ఎత్తుకు పోయిన 25 నిమిషాలకు బాబు ఆచూకీ లభ్యం అయింది. దేవుడి దయతో నా బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంటికి వెళ్లాలని మారం చేస్తున్నాడు.. మా బాబు బాగా అల్లరి వాడు.’ అని వెల్లడించారు.

Also Read : Fertilizers : రైతులకు గుడ్‌న్యూస్‌.. 10 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం