NTV Telugu Site icon

Cheetah Attack : చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి కొనసాగుతున్న చికిత్స

Cheetah

Cheetah

తిరుపతి చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రాత్రి కుటుంబీకులతో కలిసి తిరుమలకు నడిచి వెళుతున్న మూడేళ్ల బాలుడు చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి చేసింది. కౌశిక్ ను నోట కరచుకొని అడవిలోకి ఎత్తుకెళ్లేందుకు యత్నించిన చిరుత…. నడక మార్గం నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు బాబును లాక్కెళ్లింది. కుటుంబీకులు, స్థానికులు కేకలు పెట్టడంతో బాబును వదిలి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత. చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ ను హుటాహుటిన తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. బాబుకు చెవి వెనుక, మెడ, తల వద్ద గాయాలయ్యాయి. కౌశిక్ కు గత అర్ధరాత్రి సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు ప్రాణాపాయం లేదని వెల్లడించారు.

Also Read : Guru Nanak College: లక్షలు వసూలు చేసి అనుమతి లేదంటున్నారు.. విద్యార్థుల ఆందోళన

బలమైన గాయాలు కావని నిర్ధారించారు వైద్యులు. చిన్నారి కౌశిక్ పై దాడి చేసింది చిరుత కూన గా గుర్తించారు. అయితే.. చిరుతకు ఏడాదిలోపే వయసు ఉంటుందని భావిస్తున్నారు అటవీ సిబ్బంది. ఘటన జరిగిన నడక మార్గం ఏడవ మైలురాయి వద్ద అదనపు సిబ్బంది నియామించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తిరుమల నడక మార్గంలో బాలుడపై చిరుత పులి దాడి నేపథ్యంలో నడక మార్గంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది టీటీడీ. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ప్రత్యేక సూచనలు చేస్తోంది. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులు గా వెళ్ళాలని మైక్ లు ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.. శ్రీవారి మెట్టు మార్గం తరహాలోనే అలిపిరి మార్గంలో సాయంత్రం పూట సమయం కుదింపు చేసే ఆలోచన ఉంది టీటీడీ.

Also Read : BCCI Cheif Selector: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఆహ్వానాలు.. కావాల్సిన అర్హతలు ఇవే! రేసులో డాషింగ్ ఓపెనర్