NTV Telugu Site icon

Chedi Talimkhana Celebrations: నేడు అమలాపురంలో చెడీ తాలింఖానా ఉత్సవం.. ఏంటి దాని ప్రత్యేకత..?

Chedi Talimkhana

Chedi Talimkhana

Chedi Talimkhana Celebrations: దసరా వచ్చిందంటే చాలు ఒక్కో ఏరియాలో ఒక్కో విధమైన ఉత్సవాలు జరుగుతుంటాయి.. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా సందర్భంగా చెడీ తాలింఖానా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.. విజయదశమి సందర్భంగా ఆయుధాల ప్రదర్శనలతో ఊరేగింపులు నిర్వహించడం ఇక్కటి ప్రత్యేకత.. 1835లో అమలాపురం కొంకాపల్లి వీధిలో ఈ చెడీ తాలింఖానా ఉత్సవాన్ని ప్రారంభించారు.. 189 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి.. అమలాపురం దసరా చెడీ తాలింఖానా వేడుకలు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఏడు వీధుల ఊరేగింపులు కొనసాగనున్నాయి.. కర్ర సాము, కత్తి సాము వంటి 60 రకాల యుద్ధ విన్యాసాలతో చెడీ తాలింఖానా ఉత్సవం నిర్వహిస్తారు.. ఈ నేపథ్యంలో ఇవాళ అమలాపురంలో ట్రాఫిక్ కాంక్షలు విధించారు పోలీసులు.. ద్విచక్ర వాహనాల మినహా ఇతర వాహనాలకు అమలాపురం పట్టణంలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించారు పోలీసులు..

Read Also: Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి.. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలు

ఇక, అమలాపురం మహిపాలవీధిలోని శ్రీఅబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 189వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శన బుధవారం నిర్వహించారు.. చెడీ తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సన్నాహాక ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్న విషయం విదితమే.. కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.. అబ్బిరెడ్డి రామదాసు, అబ్బిరెడ్డి నరసింహారావు, మూడో తరానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు వారసత్వ సంపదగా చెడీ తాలింఖానా విద్యను దసరా ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాలుగో తరం వారసత్వంగా వీరవిద్యను ఈరోజు ప్రదర్శించబోతున్నారు.. కాగా, బ్రిటిష్‌ కాలంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సంస్థానాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా మొదలైంది. తరువాత కాలంలో స్వాతంత్య్ర ఉద్యమ‌ స్ఫూర్తికి.. సమరయోధుల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.. నాటి నుంచి ఈ వీరుల విద్య కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైంది. ప్రతీ ఏటా దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వస్తున్నాయి..

Show comments