NTV Telugu Site icon

Karimnagar: యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి..

Watsap

Watsap

ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు. తాము అమ్మాయి మనుషులం అంటూ సందీప్, ప్రణయ్, రెహన్ అనే ముగ్గురు దుండగులు రిసీవ్ చేసుకున్నారు. నగర శివార్లలోని వెలిచాల గ్రామ సమీపంకు తీసుకు వెళ్లారు.

Also Read:Ajith 64 : అజిత్ కుమార్ నెక్ట్స్.. షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే.?

అక్కడ బాధితున్ని చిత్రహింసలకు గురి చేసి 50 వేలు డిమాండ్ చేశారు. భయపడిపోయిన యువకుడు తనవద్ద ఉన్న 10 వేలు, బంధువుల నుంచి మరో 12 వేలు జమచేసి నిందితులకు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకున్న యువకుడు తనపై జరిగిన దాడి పై కొత్తపెల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రణయ్, సందీప్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. పరారీ లో ఉన్న రెహన్ కోసం గాలింపు చేపట్టారు. గతంలో జువైనల్ జైల్ కి వెళ్లిన ప్రధాన నిందితుడు సందీప్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.