Site icon NTV Telugu

Fire Accident : చార్మినార్ అగ్నిప్రమాదంపై స్పందించిన ఫైర్ డిపార్ట్‌మెంట్.. సకాలంలో చర్యలు తీసుకున్నాం

Fire Department

Fire Department

Fire Accident : చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్‌లో చోటుచేసుకున్న దుర్మార్గమైన అగ్నిప్రమాదం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (TFDRT) అధికారికంగా స్పందించింది. ఈ ఘటన ఉదయం 6:16 గంటల ప్రాంతంలో జరిగిందని, వెంటనే అప్రమత్తమైన మొగల్‌పురా ఫైర్‌స్టేషన్ సిబ్బంది కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు.

Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..

జీ ప్లస్ 2 భవనంలో మంటలు మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమై, ఆపై అంతస్తులకు వేగంగా వ్యాపించాయని TFDRT వెల్లడించింది. మంటలను పూర్తిగా అదుపు చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ ఆపరేషన్‌లో అగ్నిమాపక రోబో, స్కై లిఫ్ట్, హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ల వంటి ఆధునిక పరికరాలను వినియోగించామని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి స్పందిస్తూ, “మేము ప్రమాద స్థలానికి తక్షణమే స్పందించాం. అత్యాధునిక పరికరాలేని ఆరోపణలు తప్పుడు వున్నాయి. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసి, పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాం,” అని తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా గుర్తించాల్సి ఉందని కూడా అధికారులు తెలిపారు.

Narendra Modi : మీర్‌ చౌక్‌ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Exit mobile version