ఓటీటీలో వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా లేదా వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. కొత్త వెబ్ సిరీస్ లకు కొదవ లేదు.. తాజాగా మరో వెబ్ సిరీస్ వచ్చేస్తుంది.. రామ్ చరణ్ చిరుత బ్యూటీ నేహాశర్మ నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తుందని వార్త వినిపిస్తుంది.. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ గురించి జియో అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది..
ఓటీటీల్లో లీగల్ డ్రామా వెబ్ సిరీస్‍లు కూడా బాగానే వచ్చాయి. వాటిల్లో ‘ఇల్లీగల్’ సిరీస్ మంచి పాపులర్ అయింది.. ఇల్లీగల్ వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లు మంచి సక్సెస్ సాధించాయి. దీంతో మూడో సీజన్‍పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. తాజాగా.. ఇల్లీగల్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సిరీస్‍లో నేహా శర్మ లీడ్ రోల్ లో నటిస్తుంది. గతంలో వచ్చిన రెండు సీజన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.. అందుకే ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది..
తాజాగా ఈ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. మే 29వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా ఖరారు చేసింది. ఈ సీజన్ ట్రైలర్ కూడా వచ్చింది.. ఈ సిరీస్ హిందీతో పాటుగా తెలుగులో కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2020లోనే వచ్చింది. సూపర్ పాపులర్ అయింది. ఆ తర్వాతి ఏడాదిలోనే రెండో సీజన్ కూడా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. మరి మూడో సిరీస్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..