Site icon NTV Telugu

Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం

Team India

Team India

జూలై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకోసం బీసీసీఐ టీమ్ను కూడా ప్రకటించింది. జింబాబ్వేతో మొత్తం ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 6 నుండి జూలై 14 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. అందుకోసం టీమిండియా బయల్దేరి వెళ్లింది. అయితే.. ఇంతకుముందు ప్రకటించిన టీమిండియా జట్టులో స్వల్ప మార్పులు చేసింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ టూర్ లో సంజూ శాంసన్, శివం దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో.. సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు ఇచ్చింది బీసీసీఐ. ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు.

దేశం మొత్తం ఇంకా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన మూడ్‌లోనే ఉంది. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ముగిసినా.. భారత జట్టు ఇంకా వెస్టిండీస్‌లోనే ఉంది. హరికేన్‌ తుపాను కారణంగా విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వరల్డ్‌ కప్‌ ముగించుకుని.. జింబాబ్వే టూర్‌కు వెళ్లాల్సిన శాంసన్‌, దూబే, జైస్వాల్‌లు అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్‌లో సత్తా చాటిన ఈ ముగ్గురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు.

Read Also: Asaduddin Owaisi : లోక్‌సభలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఒవైసీ..

జింబాబ్వేతో జరిగే టీ20లకు టీమిండియా జట్టు:
శుభ్ మన్ గిల్ (కెప్టెన్)
రుతురాజ్ గైక్వాడ్
అభిషేక్ శర్మ
రింకూ సింగ్
ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
రియాన్ పరాగ్
వాషింగ్టన్ సుందర్
రవి బిష్ణోయ్
అవేశ్ ఖాన్
ఖలీల్ అహ్మద్
ముకేష్ కుమార్
తుషార్ దేశ్ పాండే
సాయి సుదర్శన్
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
హర్షిత్ రాణా

Exit mobile version