Kubera vs Kannappa : ఈ వారం గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కుబేర, ఇంకొకటి కన్నప్ప. కుబేర మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ రోజు వచ్చిన కన్నప్ప మూవీ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. ఇందులో భారీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో కన్నప్ప మూవీ కుబేర కలెక్షన్లను దెబ్బ కొడుతుందా అనే టాక్ నడుస్తోంది. కుబేర, కన్నప్ప రెండూ బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్నాయి.
Read Also : Thamannah : దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. తమన్నా షాకింగ్ పోస్ట్..
ఇందులో దేని దారి దానిదే. రెండూ మాస్ సినిమాలు కావు. ఒకటి భక్తి కథతో వచ్చింది. ఇంకొకటి బతుకు చిత్ర, భావోద్వేగాలతో వచ్చింది. రెండింటి దారులు వేరే. కాబట్టి కుబేర చూసిన వాళ్లు కన్నప్ప చూడాలని అనుకుంటారు. కన్నప్ప చూసిన వాళ్లు కుబేర చూడాలని అనుకోవచ్చు. రెండూ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలే. కాకపోతే కుబేర వచ్చి ఆల్రెడీ వారం రోజులు అవుతోంది. అందులో కన్నప్పతో పోలిస్తే పెద్ద స్టార్లు లేరు.
కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు ఉన్నారు. ఈ లెక్కన కన్నప్ప జోష్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ కుబేర లెక్కలను మార్చేసే అంత ఉండదు. కుబేర ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో ఆడుతోంది. జనాలు ఆ మూవీకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Read Also : Rashmika : అనుష్క, కీర్తి సురేష్ బాటలో రష్మిక..!